హైదరాబాద్ కొండాపూర్ లోని సి ఆర్ ఫౌండేషన్లో భారత 75 వ గణతంత్ర దినోత్సవం నేటి ఉదయం ఘనంగా జరిగింది.
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ కే. నారాయణ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు .
సి ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర రావు, మాజీ శాసనమండలి సభ్యులు పిజె చంద్రశేఖర రావు, నీలం రాజశేఖర్ రెడ్డి రీసర్చ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కే పూర్ణచంద్రరావు, ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ శ్రీమతి డాక్టర్ కూనంనేని రజిని, డాక్టర్ బి రంగారెడ్డి, డాక్టర్ మండవ గోపీచంద్, మహిళ సంక్షేమ కేంద్రం డైరెక్టర్ శ్రీమతి కృష్ణకుమారి, ప్రిన్సిపాల్ జోశ్యభట్ల కల్పన; వృద్ధాశ్రమం సలహామండలి సభ్యులు డాక్టర్ పి. సరస్వతి, శ్రీ రాజేంద్ర రావు, మేనేజర్ శ్రీనివాస్, వృద్ధాశ్రమ వాసులు మహిళా సంక్షేమ కేంద్రం వృత్తి విద్య కోర్సుల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
సి ఆర్ ఫౌండేషన్ కోశాధికారి వి. చెన్నకేశవరావు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా సంక్షేమ కేంద్రం వృత్తి విద్య కోర్సుల విద్యార్థినులు దేశభక్తి గీతాలు ఆలపించి సభ్యులను అలరింప చేశారు.
Commentaires