top of page

వికసించిన ఎర్రగులాబీకి 150 వసంతాలు

Updated: Mar 12, 2021

బుడ్డిగ జమిందార్


పోలెండ్ ‌లో 1871 మార్చి 5న జన్మించిన రోజా లగ్జంబర్గ్ 150వ జయంతి వేడుకలు నేడు ప్రపంచ కార్మికవర్గం, కమ్యూనిస్పులు జరుపుకుంటున్నారు. 1905 రష్యన్‌ విప్లవంలో పాల్గొన్న రోజా పోలెండ్‌, లిధువేనియా దేశాల సోషలిస్టు డెమొత్రటిక్‌పార్టీ స్థాపకురాల్లో ఒకరు. వామపక్ష సోషలిస్టు విభాగంలో కీలకపాత్ర పోషించి, 1918 కు ముందు ప్రపంచ సోషలిస్టు ఉద్యమంలో పాల్గొని అంతర్జాతీయంగా ప్రముఖపాత్ర పోషించారు. కాలానుగుణంగా ఆర్థిక, రాజకీయ ఎత్తుగడలు రచించటంలో దిట్టగా ప్రఖ్యాతి గాంచారు. స్విట్మరాండ్‌ జ్యూరిచ్‌లో న్యాయశాస్త్రం, రాజకీయ అర్థశాస్త్రంలో డాక్టరేట్‌ చేశారు. రోజా లగ్జెంబర్గ్‌ కుటుంబరీత్యా జర్మనీలో స్థిరపడి, పౌరసత్వం తీసుకొని జర్మన్‌ సోషలిస్టు పార్టీ చరిత్రలో కీలక భూమికురాలయ్యారు. స్పార్టకస్‌ లీగ్‌ వ్యవస్థాపకురాలిగా జర్మనీలో కమ్యూనిస్టు పార్టీ బీజం నాటారు. కార్మిక ఉద్యమ నిర్మాణంలో ప్రముఖపాత్ర నిర్వహించారు. కార్మికోద్యమ నాయకురాలుగా పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా అమె చేసిన ఉపన్యాసాలకు కార్మికలోకం ఉర్రూతలూగేది. జర్మన్‌ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకొన్న రోజాను జర్మనులు ఎర్రరోజాగా ప్రేమతో పిలిచేవారు. సోషలిస్టు పార్టీ మొదటి ప్రపంచయుద్ధాన్ని బలపరచటాన్ని వ్యతిరేకించిన కారణంగా, చివరికి 1919 జనవరి 15 నాడు మితవాద ప్రగతి నిరోధకులు దారుణంగా హత్య చేశారు.


1913వ సంవత్సరంలో ఆమె రచించిన 'కోర్‌, ఫెరిఫరీ దేశాల అర్థిక సంబంధాలు' వర్తమాన ప్రపంచ దేశాల అర్థిక సంబంధాలను ఇప్పటికీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ముఖ్యంగా నేడు కొన్ని లాటిన్‌ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాల ఆర్థిక పరిణామాలు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ దేశాలపై సాగిస్తున్న దోపిడీ‌ సంబంధాలను తెలియజేస్తూ, కమ్యూనిస్టు సిద్ధాంతాలు అజేయమైనవని చాటుతుంటాయి.


కార్ల్‌మార్స్‌ ప్రతిపాదించిన మిగులు విలువను మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసి, అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కేంద్రీకృతమవుతున్న 'పెట్టుబడి' తో ఏర్పడుతున్న అసమానతల నుండి, అర్థిక సంక్షోభం నుండి అభివృద్ధి చెందుతున్న దేశాలు బయట పడకుండ ఏ విధంగా షరతులను విధించి పెట్టుబడిదారీ దేశాలు సెంట్రల్‌ బ్యాంకుల ద్వారా ధన స్రహాయం చేస్తాయో రెడ్‌రోజా వివరంగా తెలిపారు. పెట్టుబడులను బయటి దేశాలకు విస్తరింపచేసి పెట్టుబడిదారీ దేశాల అధిపత్యాన్ని కాపాడుకోవటానికి, ప్రయత్నిస్తారని 'రెడ్‌రోజా' అంటారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలైన జర్మనీ, ఫ్రాన్సు, యూకె, అమెరికా ఈ సూత్రాన్ని గ్రీసులో అమలుజేసినట్లు సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ సోషల్‌ గ్లోబల్‌ జస్టీస్‌, నోటింగ్‌హోమ్‌ యూనివర్సిటీ సెప్టెంబరు 2014 నివేదికలో, కమ్యూనిస్టు సిద్ధాంతాల్ని బలపరుస్తూ మిగులవిలువ దోపిడీని బహిర్గతం చేశారు.

'రెడ్‌రోజా' లగ్జంబర్గ్‌ రెండవ సూత్రం - అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు సంక్షోభాలను ఎదుర్కోటానిక్రి వారి పెట్టుబడులను యూద్ధాల రూపంలో ప్రవేశపెడతాయి. ఆచరణలో మనం తాజాగా అఫ్ఘనిస్థాన్‌, సిరియా, యెమెన్‌, ఉక్రెయిన్‌, ఇరాన్‌ల పైనా, ఆసియా పసిఫిక్‌ దేశాలపైనా పెట్టుబడి దేశాల యుద్ధసన్నాహాలను చూడటంద్వారా 'రెడ్‌ రోజా' అలోచనలు ఇప్పటికీ సజీవమైనవిగా నిరూపణ అవుతున్నాయి. దోచుకున్న మిగులు విలువ ద్వారా కేంద్రీకృతమైన పెట్టుబడులతో బయటపడటానికి పెట్టుబడిదారీ దేశాలు ఇటీవలి కాలంలో గ్రీసు, ఉక్రెయిన్‌లో చొచ్చుకుపోయి ఐఎమ్‌ఎఫ్‌, ప్రపంచబ్యాంకు ద్వారా రుణాలు, యుద్దసామాగ్రి విక్రయం చేసారు.

అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అభవృద్ధి చెందుతున్న దేశాల్లో చౌకగా వచ్చే వేతనాలకు జోడించి వారు పెట్టిన పెట్టుబడులతో ఇండోనేషియా, గ్రీసు, అర్జెంటీనా, బ్రజిల్‌, భారత్‌ వంటి దేశాల్లో ఎక్కువ నాణ్యత, తక్కువ ధరలకు ఉత్పత్తి గావించి, పెట్టుబడిదారీ దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల వస్తు ఉత్పత్తులకు బలమైన పోటీ ఇవ్వటం ద్వారా దేశాలను అర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నారు. నూటికి నూరుపాళ్లూ, జర్మనీ, ఫ్రాన్సు, యూకె దేశాలు, పోర్చుగీస్‌, ఇటలీ, ఐర్లాండ్‌, గ్రీసు, స్పెయిన్‌లో (పెగ్స్‌ దేశాలు) ఇదే సూత్రాన్ని అమలు చేసాయి. పెట్టుబడిదారీ దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలపై దయా దాక్షిణ్యాలు ఉండవు. యూరోపియన్‌ యూనియన్‌ను ఉమ్మడి కుటుంబంగా పోల్చుతూ, అభివృద్ధి చెందుతున్న దేశాలపై యధేచ్చగా అర్థికదోపిడీ చేస్తున్నాయి. సమన్యాయం, సమాభివృద్ధి ఒకే స్వేచ్ఛా మార్కెటింగ్‌, షింగైన్ పాస్పోర్టు ద్రవ్యనిధి ఏర్పరచుకొన్న యూరోపియన్ యూనియన్ వాస్తవానికి వీటన్నటికీ భిన్నంగా 'రెడ్ రోజా' చెప్పనట్లు‌‌ పెట్టుబడదారీ దేశాల్లో కేంద్రీకృతమైన పెట్టుబడిని పెంచుకోవటానికే ఉపయోగించుకుంటున్నారనేది గ్రీసు, యూకై అనుభవాలు మనకు చెబుతున్న 'రెడ్‌రోజా' సత్యాలు. గ్రీసులో ఆర్థికపరంగా దివాళా తీయించటానికి కారణం వాస్తవానికి ఎ) ఐరోపా సెంట్రల్‌ బ్యాంకు, బి) ఈయూ దేశాలైన జర్మనీ, ఫ్రాన్సు దేశాల అధివత్యంగల ఐరోకమిషన్‌ ఏ) ఐఎమ్‌ఎఫ్‌ బ్యాంకుల దుష్టత్రయం.

ఇవి రెండుసార్లిచ్చిన ఉర్ధీపన రుణం 240 వందలకోట్ల యూరోల్లో 81శాతం మనహాయించుకుని గ్రీసుకు 19 శాతమే చేతికిఇవ్వటం గమనార్హం. గ్రీసులో విధించిన షరతుల్లో భాగంగా ప్రైవేటు బాండ్ల విలువ 53.5 శాతానికి తగ్గించారు. కాని, 1 శాతం కూడా, దుష్టత్రయం, రుణాలను వడ్డీలను తగ్గించేందుకు సుముఖం చూపలేదు. సంక్షోభంలో ఉన్న గ్రీసుతో 4 శాతం జీడీపి ధనంతో యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయించారు. జర్మనీ, ప్రాన్సులలో లేనట్లుగా 23 శాతం పన్నులను వనూలు చేయిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ దేశాలలో ఈ విధంగా కొత్త సంక్షోభాలకు కారణమవుతుంది. తన వ్యవస్థను తానే ధ్వంసం చేసుకోడానికి ప్రజావ్యతిరేకతే మార్గం సుగమం చేస్తుంది. తద్వారా సామ్యవాద వ్యవస్థాపక బీజాలు అనివార్యమవుతాయి.


రెడ్‌రోజాకు రెడ్‌ సెల్యూట్‌










0 comments

Comments


bottom of page